News Alert

బాలుడిపై వీధి కుక్క దాడి.. వీడియో వైరల్

Share with

కేరళలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. సెలవురోజు కావడంతో తన మట్టుకు తాను ఆడుకుంటున్న ఓ బాలుడిపై వీధి కుక్క దాడికి చేసి తీవ్రంగా గాయపరించింది. బాలుడిపై కక్ష కట్టాయా అన్న రేంజ్‌లో వీధి కుక్క దాడి చేసింది. కాగా, ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కేరళ కోజికోడ్‌ జిల్లాలోని అరక్కినార్​లో వీధి కుక్క భీభత్సం సృష్టించింది. సైకిల్​ వస్తున్న నూర్ అనే 7వ తరగతి చదువుతున్న బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, బాలుడిపై కక్ష కట్టిందా అన్న రేంజ్‌లో కుక్క దాడి చేసింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి జరిగిన ఘటన బయటకు వచ్చింది.

అలాగే, కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి.. ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కేరళను డాగ్స్‌ ఓన్‌ కంట్రీ అని కామెంట్స్‌ చేస్తున్నారు.