Home Page SliderNational

“తాండూరులో పప్పుదినుసుల బోర్డు ఏర్పాటు చేయాలి”:మంత్రి తుమ్మల

Share with

ఈ రోజు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 10 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ మంత్రులతో ఆయా రాష్ట్రాలలో పప్పుదినుసుల సాగు మరియు వాటి విస్తీర్ణాన్ని పెంచే దిశగా చేపట్టవల్సిన చర్యల గురించి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భముగా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన దేశములో పప్పు దినుసుల సాగును పెంచాల్సి ఉందనన్నారు.కాగా అది మనందరి తక్షణ కర్తవ్యమని దానికి తగ్గట్లు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలియజేసారు. తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భముగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములో పండించే తాండూరు కందిపప్పుకు ప్రపంచములోనే విశిష్ట స్థానముందన్నారు. ప్రతి సంవత్సరము 4 లక్షల క్వింటాళ్ళ కందిపప్పు అక్కడి నుండే మార్కెట్ కు వస్తుందని తెలిపారు.  కాబట్టి దానిని మరింత ప్రొత్సహించేందుకు అక్కడ పప్పుదినుసుల బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా తుమ్మల  కేంద్ర మంత్రికి విజ్ఙప్తి చేశారు.అదేవిధంగా పప్పుదినుసుల సేకరణకు సంబంధించి విధించిన 25 శాతం పరిమితిని ఎత్తివేసి, 100 శాతం చేయాల్సిందిగా విజ్ఙప్తి చేశారు. దీనివలన పప్పుదినుసుల పంటను సాగుచేసే రైతులకు ప్రొత్సహకరంగా ఉంటుందని, మార్కెట్లలో తలెత్తే ఒడిదుడుకులు తట్టుకోగలరని మంత్రి తుమ్మల తెలియజేశారు.