తెలంగాణా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణాలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.దీని ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు CBRT విధానంలో డీఎస్సీ పరీక్షలను తెలంగాణా ప్రభుత్వం నిర్వహించనుంది. కాగా ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్లలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలో మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.