ఫేక్ డాక్యుమెంట్లతో ఇల్లు కబ్జాకు ఐపీఎస్ నవీన్ కుమార్ యత్నం.. అరెస్టు
ఫేక్ డాక్యుమెంట్లతో ఇల్లు కబ్జాకి ప్రయత్నించాడన్న కారణంతో పోలీస్ అకాడమీలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ నవీన్ కుమార్ను అరెస్టు చేశారు పోలీసులు. 41 సీఆర్పీసీ కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదుతో ఈ అరెస్టు జరిగింది. భన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉంటూ ఆయన ఇల్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. దీనితో సీసీఎస్ పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నారు. నవీన్ కుమార్కు గతంలో కూడా పోలీసులను ఇంట్లో పనులకు వాడుకున్నాడని పేరు ఉంది. ఒక ఐపీఎస్ అధికారిని ఇలాంటి ఆరోపణలతో అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.