తెలుగు హీరో వేధించాడన్న హీరోయిన్ హన్సిక
దేశముదురు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ హన్సిక. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో యూత్‌లో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆమె వరుస సినిమాల అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్,కన్నడ,హిందీ సినిమాల్లో నటించి మంచి విజయాలు సాధించారు. ఈ విధంగా ఆమె కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అయితే ఆమె ఇటీవల తన ఫ్రెండ్,ముంబైకి చెందిన వ్యాపార వేత్తను పెళ్లాడిన విషయం తెలిసిందే. కాగా హన్సిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆమె ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో గతంలో ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. అస్తమానం డేటింగ్‌కి వెళ్దామంటూ విసిగించేవాడన్నారు. అయితే ఆ హీరోకి తగిన బుద్ది చెప్పానని ఆమె వెల్లడించారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. దీంతో హన్సికను వేధించిన హీరో ఎవరు అని ఆమె ఫ్యాన్స్ నెట్టింట చర్చలు జరుపుతున్నారు.