Home Page SliderNational

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మంత్రులు వెనుకంజ

Share with

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వక్కలిగ సామాజికవర్గానికి గుండెకాయలాంటి మాండ్యాలో బీజేపీ మూడో స్థానంలో వెనుకంజలో ఉంది. జేడీఎస్ అభ్యర్థి హెచ్టీ మంజు, కాంగ్రెస్ అభ్యర్థి బీఎల్ దేవరాజుల కంటే, బీజేపీ మంత్రి నారాయణ్ గౌడ కేసీ వెనుకంజలో ఉన్నారు. కర్నాటకలోని వక్కలిగ కమ్యూనిటీ ప్రధానమైన రైతు సమాజంలో ఒకటి. రాష్ట్ర జనాభాలో దాదాపు 15 శాతం మంది వక్కిలగలు ఉన్నారు. వీరు మైసూరు, మాండ్య, హాసన్, కనకపుర, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలతో సహా దక్షిణ కర్ణాటక ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు. జనాభాలో సగానికి పైగా వక్కలిగలు ఉన్న ఏకైక జిల్లా మాండ్య.

కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి బళ్లారి సిటీలో వెనుకంజలో ఉన్నారు. ఇక హూబ్లీలో మాజీ సీఎం జగదీష్ షెట్టర్ సైతం వెనుకబడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి, గాలి లక్ష్మి అరుణ సైతం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోండటంతో ఎమ్మెల్యేలందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. చెన్నపట్నలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు.