Home Page SliderInternational

ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల నుండి 7 లక్షలమంది చిన్నారులు రష్యాకు తరలింపు

Share with

ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల నుండి 7 లక్షలమంది చిన్నారులు రష్యాకు తరలించినట్లు రష్యా అంగీకరించింది. తమ ప్రాంతంలో, రక్షణ శిబిరాలలో ఉక్రెయిన్ శరణార్థ చిన్నారులున్నారని రష్యా పార్లమెంట్ ఎగువ సభకు చెందిన గ్రిగోరి వెల్లడించాడు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టినప్పడి నుండి రష్యా తమ చిన్నారులను బలవంతంగా తీసుకెళ్తోందని, ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్‌లో యుద్ధప్రభావిత ప్రాంతాలలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలైన చిన్నారులను రక్షించేందుకే వారిని రష్యాకు తీసుకువచ్చామని, రష్యా వాదిస్తోంది. రష్యా ఉక్రెయిన్ పౌరులను, చిన్నారును అక్రమంగా తీసుకుపోతోందని అమెరికా కూడా వెల్లడి చేస్తోంది. గత ఏడాదిన్నరగా రష్యా మొదలు పెట్టిన దండయాత్ర ఇంకా కొనసాగుతోంది. వేలమంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. జనాభా తక్కువగా ఉన్న రష్యా ఇలా ప్రత్యర్థి దేశాల చిన్నారులను తమ దేశానికి బలవంతంగా తీసుకుపోతోందని ఉక్రెయిన్ పేర్కొంది. వారిని బాంబు ప్రభావిత ప్రాంతాల నుండి తీసుకువచ్చినట్లు వెల్లడించారు . రష్యా న్యాయశాస్త్రం ప్రకారం కూడా అక్రమ తరలింపు నేరంగా పరిగణింపబడుతుంది. ఉక్రెయిన్ పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించడం ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే. దీనికి కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టు చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.