InternationalNews Alert

న్యూజీలాండ్ దీవుల్లో 500 తిమింగలాలు మృతి

Share with

న్యూజీలాండ్‌ దీవుల్లో మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 500 తిమింగ‌ళాలు (పైల‌ట్ వేల్స్‌) మృతి చెందాయి. చాథ‌మ్ దీవుల వద్ద 250, పిట్ దీవిలో మరో 240 తిమింగ‌లాలు మృతి చెందిన‌ట్లు ప్ర‌భుత్వం అధికారులు తెలిపారు. ఆ దీవులు న్యూజిలాండ్‌కు చాలా దూరంగా ఉన్న నేప‌థ్యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ క‌ష్టంగా మారిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో షార్క్‌లు ఉన్నాయ‌ని, అవి మ‌నుషుల‌పై, వేల్స్‌పై దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని, అందుకే రెస్క్యూ ఆప‌రేష‌న్ అసాధ్యంగా మారిన‌ట్లు మెరైన్ అడ్వైజ‌ర్ దేవ్ లుండ్‌కిస్ట్ తెలిపారు. అయితే ఆ తిమింగ‌ళాలు స‌హ‌జంగానే తీరంలో కుళ్లిపోతాయని అధికారులు చెప్పారు. చాథ‌మ్ దీవిలో 1918లో అత్య‌ధికంగా ఒకేసారి సుమారు వెయ్యికి పైగా తిమింగ‌లాలు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.