Home Page SliderInternational

“ఎవర్‌గ్రీన్” ఉద్యోగులకు 50 నెలల బంపర్ బోనస్

Share with

ఈ రోజుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే పలు సంస్థలు సతమతమవుతున్నాయి. అయితే తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ సంస్థ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా 4 సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఈ విషయాన్ని  కంపెనీతో సంబందం ఉన్న వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఎవర్‌గ్రీన్ అనేది ఒక షిప్పింగ్ సంస్థ. ఈ షిప్పింగ్ సంస్థ తమ ఉద్యోగులకు 50 నెలల జీతాన్ని బోనస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తైవాన్ కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఈ బోనస్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా గత రెండేళ్లల్లో ఈ సంస్థ భారీగా లాభాలను గడించింది. అయితే గత సంవత్సరంలో ఈ సంస్థకు చెందిన నౌక ఈజిప్టులోని సూయజ్  కాలువలో ఇరుక్కుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.