Home Page SliderTelangana

రాజశేఖర్ రెడ్డి సొంత మండలంలో గ్రూప్-1కు 40 మంది క్వాలిఫై

Share with

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని SIT అధికారులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయితే ఈ విచారణలో భాగంగా కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మండ్యాల మండలం పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి సొంత మండలం కావడంతో వందలమంది క్వాలిఫై అయ్యారని TPCC ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలో జగిత్యాలోని మండ్యాల మండలం సంచలనంగా మారింది. కాగా ఈ మండలంపై SIT పోలీసులు దృష్టి సారించారు. కాగా వారు ఈ మండలానికి వెళ్లి విచారించారు. ఈ విచారణలో భాగంగా మొత్తం 40 మంది అభ్యర్థులు గ్రూప్-1 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినట్లు నిర్థారించారు. అయితే ఆ మండలంలో ఎంతమంది పరీక్షలు రాశారు? వారికి ఎన్ని మార్కులు వచ్చాయనే అంశాలపై విచారించినట్లు తెలుస్తోంది.