Home Page SliderNational

“నీట్ పేపర్ రూ.30 లక్షలకు అమ్మేశాను”:అమిత్

Share with

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సూత్రధారిగా ఉన్న అమిత్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా నీట్ ప్రశ్నాపత్రాన్ని పరీక్షకు ముందు రోజు లీక్ చేసినట్లు అమిత్ ఆనంద్ అంగీకరించాడు. నీట్ అభ్యర్థుల నుంచి రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాలను అభ్యర్థులకు ఇచ్చినట్లు అమిత్ వెల్లడించాడు. కాగా దానాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో జూనియర్ ఇంజినీర్ సికిందర్‌తో కలిసి ఓ నలుగురు విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు విచారణలో తేలింది. అనంతరం నీట్ ప్రశ్నాపత్రాన్ని అమిత్ తన ఫ్లాట్‌లో కాల్చేసినట్లు పోలీసులు అవశేషాలను గుర్తించినట్లు తెలుస్తోంది.మరోవైపు దేశంలోని నీట్ అభ్యర్థులంతా ఈ నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేసి మాకు తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతుూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.