Home Page SliderTelangana

తెలంగాణాలో మరికాసేపట్లో వర్షం

Share with

తెలంగాణాలోని పలు జిల్లాల్లో మరి కాసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదిలాబాద్,జగిత్యాల,కామారెడ్డి,నిజామాబాద్,పెద్దపల్లి,సిరిసిల్ల,సిద్దిపేట,వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అంతేకాకుండా అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.