Home Page SliderTelangana

డ్యాన్స్‌తో దుమ్ము దులిపిన కాజల్, శ్రీలీల

Share with

బాలకృష్ణ న్యూమూవీ భగవంత్ కేసరి షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు హీరోయిన్స్. ఈ సందర్భంలో ఈ చిత్ర హీరోయిన్స్ కాజల్, శ్రీలీల దుమ్ము దులిపేశారు. స్టార్ట్ మ్యూజిక్ అంటూ బాలకృష్ణ పాత పాటలకు ఉత్సాహంగా చిందులు తొక్కారు. వీ ఆర్ నాట్ డన్ యట్ అంటూ తిరిగి డ్యాన్స్ కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. గులాబీ రంగు టీ షర్ట్స్‌తో వీరిద్దరూ చేసిన డ్యాన్స్ అభిమానులకు కన్నులవిందు చేస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆమె డ్యాన్స్ చూసిన అభిమానులు క్వీన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. బాలకృష్ణ పాటలకు వీళ్ల చేత డాన్స్ చేయించి, వాళ్లతో దెబ్బలు తిన్నట్లు నటిస్తున్నారు అనిల్ రావిపూడి.