Andhra PradeshTrending Today

ఏపీలో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎంతంటే?

Share with

ఏపీలో పోలింగ్ లెక్కలు ఇప్పుడిప్పుడే ఈసీ వెల్లడిస్తోంది. ఏపీలో మొత్తం పోలింగ్ పై ఈసీ ఇప్పుడే క్లారిటీ ఇచ్చింది. బ్యాలెట్ ఓట్లు 80.66 శాతంగా ఉండగా ఇప్పుడది పోస్టల్ బ్యాలెట్ కూడా జత చేయడంతో ఆ లెక్కలు 81.66 శాతంగా ఉన్నాయి. పురుష ఓటర్లు 1,64,30,359 మంది ఓటేయగా, మహిళా ఓటర్లు 1,69,08,684 మంది ఓటేశారు. థర్డ్ జెండల్ 1517 మంది ఓటేయగా, మొత్తం 3 కోట్ల 33 లక్షల 40 వేల 560 మంది ఓటేశారు. ఈ లెక్కన పోల్ పర్సంటేజ్ 80.66గా ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,44,216 కాగా, ఇంటి వద్ద ఓటేసినవారు 53,573 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరు 4,97,789, పర్సంటేజ్ వైజ్ గా తీసుకుంటే 1.2 శాతం ఉన్నారు. దీంతో మొత్తం టర్నవుట్ 3,38,38,349 మంది ఓటేయగా పర్సంటేజ్ వైజ్ గా చూస్తే 81.86 శాతం ఉంది.